తాజావార్తలు

Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది

Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది


Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంది. వీరి సినిమాలు విడుదలైనప్పుడు అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అయితే, నిజ జీవితంలో బాలకృష్ణ, చిరంజీవి మంచి ఫ్రెండ్స్. ఒకరి సినిమాల పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉంది. అనేక సందర్భాలలో ఇద్దరు ఒకరి సినిమాలు మరొకరు పరస్పరం అభినందించుకున్నారు. అంతేకాకుండా, స్నేహపూర్వకంగా ముచ్చటించుకుంటారు.

బాలకృష్ణకు చిరంజీవి నటించిన చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి అంటే ఎంతో ఇష్టం. తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అద్భుతం అని బాలయ్య పలు ఇంటర్వ్యూలలో ప్రశంసించారు. ఆ సినిమా మేకింగ్ స్టైల్ కూడా తనకు బాగా నచ్చిందని బాలకృష్ణ తెలిపారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను ఆనందపరిచాయి. ఖైదీ చిత్రం కూడా తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ గతంలో వెల్లడించారు. అన్‌స్టాపబుల్ షోలో కూడా చిరంజీవి పోరాటాలు, డ్యాన్సుల్లో చూపించే గ్రేస్ తనకు బాగా ఇష్టమని బాలయ్య చెప్పారు.

వీరిద్దరూ ఒకరి సినిమాలను మరొకరు చూసి, వాటిలోని మైనస్ పాయింట్లను కూడా చర్చించుకుంటూ ఉంటారని టాక్. బాలయ్య నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇవి కూడా తనకు చాలా ఇష్టమని చిరంజీవి అనేక సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. ఒకరి పట్ల మరొకరికి ఉన్న ఈ గౌరవమే వారి స్నేహాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిలబెడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *