తాజావార్తలు

Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!


Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

ఒక స్టార్ హీరో అసలైన స్టామినా ఏంటనేది ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాతే స్పష్టంగా బయటపడుతుంది. గేమ్ ఛేంజర్ లాంటి అనూహ్యమైన ఫలితం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ ఎలా ఉండబోతోందా అని లెక్కలు వేసుకున్న ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేస్తోంది ఆయన తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అసలు థియేటర్లలో ఇంకా ఒక్క టికెట్ కూడా తెగకముందే ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుందంటే.. బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ బ్రాండ్ వాల్యూ ఏంటో, గ్లోబల్ స్టార్ ఇమేజ్ పవర్ ఏంటో ట్రేడ్ వర్గాలకు అర్థమైపోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

ప్రీ రిలీజ్ పరంగా రికార్డులు తిరగరాస్తూ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది పెద్ది ఇప్పుడు. ముఖ్యంగా OTT రైట్స్ పరంగా ఈ చిత్రం టాప్ లేపేస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అన్ని భాషలకు కలిపి ఏకంగా రూ. 115 కోట్ల నుంచి రూ. 130 కోట్ల మేర నెట్‌ఫ్లిక్స్ డీల్ క్లోజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్‌గా చరణ్‌కు ఉన్న రీచ్, ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో ఆయనకున్న క్రేజ్ వల్లే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే నిర్మాతలకు చాలా వరకు బడ్జెట్ రికవరీ అయిపోయినట్లే లెక్క. ఇక టెలివిజన్ శాటిలైట్, ఆడియో హక్కుల విషయానికొస్తే.. ఇక్కడ కూడా చరణ్ తన మార్క్ చూపిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

‘పెద్ది’ ఆల్ లాంగ్వేజెస్ శాటిలైట్ రైట్స్ సుమారు రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్య అమ్ముడుపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అంచనా. ఇందులో కేవలం తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కులే రూ. 35 నుంచి 40 కోట్ల రేంజ్‌లో పలుకుతుండగా.. హిందీ, ఇతర భాషల హక్కుల ద్వారా మరో రూ. 20 నుంచి 30 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు మ్యూజిక్ రైట్స్‌ను కూడా ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ ఏకంగా రూ. 35 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోవడం గమనార్హం. ఆడియో పరంగా ఈ రేంజ్ ఫిగర్ రావడం ట్రేడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే విడుదలైన చికిరీ చికిరీ పాట రప్ఫాడిస్తుంది.. ఏఆర్ రెహ్మాన్ బ్రాండ్ వ్యాల్యూ కూడా మ్యూజిక్ రైట్స్‌కు హెల్ప్ అవుతుంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ ‘పెద్ది’ క్రేజ్ మామూలుగా లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏర్పడిన ఫాలోయింగ్ దృష్ట్యా.. ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ సునాయాసంగా రూ. 40 కోట్లకు పైగానే అమ్ముడుపోయాయని తెలుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

ఇవన్నీ కలుపుకుంటే.. ఓటీటీ, శాటిలైట్, ఆడియో, ఓవర్సీస్ రూపంలో ‘పెద్ది’ నాన్-థియేట్రికల్ బిజినెస్ అప్పుడే రూ. 275 కోట్లను ఈజీగా దాటేసింది. అంటే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే.. ఏ మాత్రం రిస్క్ లేకుండా నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారన్నమాట. చరణ్ బ్రాండ్ మాత్రమే ఈ స్థాయి ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను ఏకపక్షంగా డ్రైవ్ చేస్తుందని ఇండస్ట్రీ అనలిస్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బుచ్చిబాబు సాన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఒక ఫ్లాప్ ఎఫెక్ట్ తన బిజినెస్ పై ఏమాత్రం పడకుండా మెగా వారసుడు పర్ఫెక్ట్‌గా రప్ఫాడిస్తున్నాడు. ముందు సినిమా ఫలితం ఎలా ఉన్నా, అది చరణ్ బాక్సాఫీస్ పుల్‌ను ఇసుమంత కూడా డ్యామేజ్ చేయలేకపోయిందని ‘పెద్ది’ లెక్కలు నిరూపిస్తున్నాయి. ఏప్రిల్ 30న బరిలో దిగుతున్న ఈ చిత్రం, కేవలం నాన్-థియేట్రికల్‌గానే కాదు, థియేట్రికల్ బిజినెస్‌లోనూ భారీ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలిక.. ఏం జరగబోతుందో..?

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *