తాజావార్తలు

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!


కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న దాదాను 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా? దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌)లో మొత్తం 1012 వరకు ఖాళీలు ఉన్నాయి. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితన విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతితోపాటు ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా మార్చి 2వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. పరీక్షకు హాజరైతే ఇందులో చాలా వరకు రిఫండ్‌ అవుతుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు గడువు ముగిసేలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జోనల్‌ వారీగా ఖాళీల వివరాలు:

  • సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌)లో పోస్టుల సంఖ్య: 1,012
  • నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేస్‌ (జైపుర్‌)లో పోస్టుల సంఖ్య: 974,
  • ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే (భువనేశ్వర్)లో పోస్టుల సంఖ్య: 803,
  • వెస్ట్రన్‌ రైల్వే (ముంబయి)లో పోస్టుల సంఖ్య: 3,148,
  • నార్త్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ (ప్రయాగ్‌రాజ్)లో పోస్టుల సంఖ్య: 1,183,
  • సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే (హుబ్లీ)లో పోస్టుల సంఖ్య: 90
  • వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (జబల్‌పూర్‌)లో పోస్టుల సంఖ్య: 1147,
  • నార్తన్‌ రైల్వే (న్యూఢిల్లీ)లో పోస్టుల సంఖ్య: 3537,
  • సదరన్‌ రైల్వే (చెన్నై)లో పోస్టుల సంఖ్య: 1036;
  • నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే (గోరఖ పుర్‌)లో పోస్టుల సంఖ్య: 1196;
  • నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్ రైల్వే (గువహటి)లో పోస్టుల సంఖ్య: 1776,
  • ఈస్ట్రన్‌ రైల్వే (కోల్‌కతా)/మెట్రో కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 1173,
  • సెంట్రల్‌ రైల్వే (ముంబయి)లో పోస్టుల సంఖ్య: 1979,
  • ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (హాజీపుర్‌)లో పోస్టుల సంఖ్య: 993
  • సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (కోల్‌కతా)లో పోస్టుల సంఖ్య: 949,
  • సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ (బిలాస్‌పుర్‌)లో పోస్టుల సంఖ్య: 1199

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి, 2, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 4, 2026.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 5 నుంచి 14వ తేదీ వరకు, 2026.

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *