తాజావార్తలు

TG Polycet 2026: పదో తరగతి పాసైన వారికి తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

TG Polycet 2026: పదో తరగతి పాసైన వారికి తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 206-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా మొదలయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఏప్రిల్‌ 20 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ వంటి డిప్లొమా సీట్లలో ప్రవేశాలు పొందవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ డిప్లొమా, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్‌ డిప్లొమా, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

పదోతరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు ఎవరైనా పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఎలాంటి ఆలస్య రుసులు లేకుండా ఏప్రిల్ 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్ విద్యార్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులు రూ.250 చొప్పున దరఖాస్తు సమయంలో సమర్పించవల్సి ఉంటుంది. ఇక పాలీసెట్‌ రాత పరీక్ష మే 13, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 21, 2026.
  • రూ.300 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 22, 2026.
  • తెలంగాణ పాలీ సెట్‌ 2026 రాత పరీక్ష నిర్వహణ తేదీ: మే 13, 2026.

తెలంగాణ పాలీసెట్‌ 202 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *