కావాల్సిన పదార్థాలు: పావు కిలో బోన్లెస్ చికెన్, అర కప్పు శనగ పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కట్ట చిన్నది, కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, నూనెను తీసుకోవాలి.
ముందుగా నానబెట్టిన శనగపప్పును తీసుకుని రోట్లో దంచుకుని దానిని ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్ ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసి మిక్సీలో పట్టుకోవాలి.
అలా ఆ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి చేతితో కలుపుకోవాలి.
చేతులను శుభ్రం చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ రాసుకునిపిండి మిశ్రమాన్ని తీసుకుని మరి పెద్దగా కాకుండా చిన్న వడలు లాగా చేసుకోవాలి.
వీటిని తీసుకుని పాన్ లో వేసి మీడియం మంటపై బంగారు కలర్ లోకి మారే వరకు వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి చికెన్ వడలు రెడీ.





