తాజావార్తలు

Manchu Manoj: విద్యార్థులకు మంచు మనోజ్ విలువైన సలహా! ఐఫోన్ 17 ప్రో మాక్స్ కవర్ వెనుక రహస్యం ఇదే!

Manchu Manoj: విద్యార్థులకు మంచు మనోజ్ విలువైన సలహా! ఐఫోన్ 17 ప్రో మాక్స్ కవర్ వెనుక రహస్యం ఇదే!


ఆడంబరాల కోసం అప్పులు చేయవద్దంటూ ఆయన చెప్పిన మాటలు యువతలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఆయన మాటల్లో వేగం ఉంటుంది.. చేతల్లో ఉత్సాహం ఉంటుంది. మంచు కుటుంబం నుండి వచ్చిన ఈ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సంపాదించుకున్నాడు. తాజాగా ఒక యూనివర్సిటీ ఈవెంట్‌కు అతిథిగా వెళ్లిన ఆయన, స్టేజీపై తన జేబులో నుండి ఒక ఐఫోన్ తీసి అందరికీ చూపించాడు. ఆ ఫోన్ వెనుక ఉన్న ఒక చిన్న రహస్యాన్ని బయటపెడుతూ, నేటి తరం యువత విలాసాల కోసం ఎలా తప్పుదారి పడుతున్నారో కళ్లకు కట్టినట్లు వివరించాడు. తన ఫోన్ కవర్ వెనుక దాగి ఉన్న జీవిత సత్యాన్ని పంచుకున్న ఆ హీరో మరెవరో కాదు.. మంచు మనోజ్.

పాత ఫోన్.. కొత్త కవర్

విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనోజ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఆయన ఇప్పటికీ పాత మోడల్ ఐఫోన్‌నే వాడుతున్నాడట. కానీ దానికి మాత్రం లేటెస్ట్ iPhone 17 Pro Max కవర్ వేసి మేనేజ్ చేస్తున్నట్లు సరదాగా చెప్పాడు. “చూశారా.. లోపల పాత ఫోన్ ఉన్నా, బయటకు కొత్తదిలా కనిపిస్తోంది. కేవలం ఇతరుల మెప్పు కోసం, సమాజంలో గొప్పలు చెప్పుకోవడం కోసం కొత్త ఫోన్లు కొనాల్సిన అవసరం లేదు. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి” అని ఆయన సూచించారు.

విలువైన జీవిత పాఠం..

గౌరవం అనేది మనం వాడే ఖరీదైన వస్తువుల వల్ల రాదని, మనం చేసే పనుల వల్ల మాత్రమే వస్తుందని మనోజ్ స్పష్టం చేశారు. “ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం అప్పులు చేసి విలాసవంతమైన వస్తువులు కొనకండి. డబ్బును వృథా చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయండి” అంటూ యువతకు హితబోధ చేశారు. ఆడంబరాలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవద్దని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ పంచుకున్న ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చాలా కాలం తర్వాత మనోజ్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. బ్రిటిష్ క్రూర పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రలో మనోజ్ కనిపించబోతున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో మారియా ర్యబోషప్క కథానాయికగా నటిస్తోంది. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మంచు మనోజ్ ఒక మంచి సందేశాన్ని ఇచ్చి అందరి మనసు గెలుచుకున్నారు. ఆడంబరాల కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని మనోజ్​ నిరూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *