తాజావార్తలు

Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు


టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. నటుడు సప్తగిరితో తనకున్న స్నేహంపై పలు ఆసక్తికర అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సప్తగిరికి తానే ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చానని అనిల్ పేర్కొన్నాడు. అయితే, సప్తగిరి తన సినిమాల్లో తరచుగా కనిపించకపోవడంపై వివరణ ఇచ్చాడు. సప్తగిరి పూర్తి నిడివి గల పాత్రలనే కోరుకుంటాడని, ఒకటి లేదా రెండు సీన్స్ కోసం మాత్రమే నటించడానికి ఇష్టపడడని అనిల్ తెలిపాడు. సప్తగిరి తనకు తరచుగా ఫోన్ చేసి.. ఒకటి లేదా రెండు సీన్లు అయితే చేయలేనని స్పష్టం చేస్తాడని అనిల్ వివరించాడు. సప్తగిరికి సరిపోయే మంచి నిడివి పాత్ర తాను రాసినప్పుడే అవకాశం ఇస్తానని అనిల్ పేర్కొన్నాడు.

అయితే అలాంటి అవకాశాలు ప్రస్తుతం కుదరడం లేదని తెలిపాడు. ఒకటి, రెండు మంచి ఎపిసోడ్‌లు దొరికినా, సప్తగిరి అవి చేయడానికి ఒప్పుకోవడం లేదని, ఈ విషయంలో సప్తగిరి వైపు కూడా తప్పు ఉందని అనిల్ అభిప్రాయపడ్డాడు. అనిల్ రావిపూడి, సప్తగిరిల స్నేహం అసిస్టెంట్ డైరెక్టర్ల రోజు నుంచీ కొనసాగుతోంది. కందిరీగ సినిమా సమయంలో సప్తగిరి యాడిగా పోయేది ట్రాక్ చేశాడని, ఆ సీన్‌ను వాసుకి చెప్పి, పొడిగించి సప్తగిరికి అవకాశం ఇచ్చానని అనిల్ గుర్తుచేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *