తాజావార్తలు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు


2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. వేమగిరి, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి మరియు కోటిలింగాల రేవు వరకు ఉన్న ప్రధాన మార్గాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భారీ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి, అక్కడి నుండి భక్తులను ఘాట్ల వద్దకు చేరవేసేందుకు ప్రత్యేక షటిల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక కారిడార్‌ను అందుబాటులో ఉంచాలని ఎస్పీ సూచించారు. అలాగే, ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల కోసం ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, అన్నప్రసాద వితరణ క్రమబద్ధంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *