తాజావార్తలు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ? క్రేజీ కాంబోపై ఇండస్ట్రీ టాక్!

🔥 క్రేజీ కాంబో: ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ధురంధర్’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ కథను అల్లు అర్జున్‌కు వినిపించగా, కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్య తెరకెక్కిస్తున్న ‘ధురంధర్–2’ మార్చిలో విడుదల కానుంది.

ఆ మూవీ తర్వాత ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ మూవీకి కమిట్ అయ్యాడు. అలాగే లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా సినిమాలు లైనప్‌లో ఉన్నాయని సమాచారం.

దీంతో బన్నీ కెరీర్‌లో ఇది అత్యంత పవర్‌ఫుల్ లైనప్‌గా మారింది.

ఆదిత్య ధర్ – అల్లు అర్జున్ కాంబో నిజమైతే, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, పాన్ ఇండియా లెవెల్‌లో భారీ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *