తాజావార్తలు

100 మీటర్ల లోతులో లోయలోకి పడిన బస్సు.. ఆరుగురు మృతి.. 20 మందికి గాయాలు


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టెహ్రీ గఢ్వాల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ బజార్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఒక బస్సు వంతెన నుంచి సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది.ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసి అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. బ్యాసి, ధాల్వాలా పోస్టులకు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.పోలీసు సిబ్బంది, జిల్లా అధికారులు సహా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెహ్రీ జిల్లా మేజిస్ట్రేట్ నితికా ఖండేల్వాల్, ఎస్‌ఎస్‌పి శ్వేతా చౌబే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.బస్సు హరిద్వార్ నుంచి బయలుదేరినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *