తాజావార్తలు

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు..!


Train Accident: బుధవారం ఉదయం అస్సాంలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. గౌహతి శివార్లలోని దిగారు సమీపంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం, నవంబర్ 11వ తేదీ ఉదయం మిజోరం నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న రైలులో ఈ ప్రమాదం జరిగింది. ఏడు కోచ్‌లు, ఇంజన్ పట్టాలు తప్పాయి. అయితే గాయపడిన ప్రయాణికులకు చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సహాయక, రెస్క్యూ చర్యలను వెంటనే ప్రారంభించారు. జనరల్ మేనేజర్, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు.

గౌహతి సమీపంలో ప్రమాదం:

గౌహతి శివార్లలోని దిగారు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, గాయపడిన వారి కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదు. ఎంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందో కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నష్టం పూర్తి స్థాయిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *