తాజావార్తలు

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్ష!


వాహనాలు నడపడం నేర్చుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్ష రాసేందుకు ఇకపై రవాణా కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంటి నుంచే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ‘సారథి’ న్యూ లెర్నర్ లైసెన్స్ పరీక్ష విధానంతో పాటు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను పరిశీలిస్తోంది. ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే వారం రోజుల్లోనే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ కొత్త విధానంలో అభ్యర్థులు తమ ఇంటి నుంచే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పరీక్ష రాయవచ్చు. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పారదర్శకత కోసం ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయ్యాక, ముఖ గుర్తింపు ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ పూర్తి చేస్తారు. పరీక్ష జరుగుతున్నంత సేపు ఏఐ వ్యవస్థ అభ్యర్థి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. పరీక్ష సమయంలో సెక్యూర్డ్ బ్రౌజర్‌ను తప్పనిసరి చేశారు. పరీక్ష రాస్తుండగా కెమెరా ముందు నుంచి అభ్యర్థి పక్కకు తప్పుకున్నా, మధ్యలో వేరే వ్యక్తి వచ్చినా, వేరే వెబ్‌సైట్లు తెరవడానికి ప్రయత్నించినా ఏఐ వ్యవస్థ తక్షణమే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా ఫేషియల్ వెరిఫికేషన్ పలుమార్లు విఫలమైతే, అభ్యర్థి ఫోన్‌కు ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత నేరుగా సమీపంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ 2 గంటలే..

ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *