కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. చిన్న ఉల్లిపాయలు 10 నుండి 15, మిరియాల పొడి 1 టీస్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, చిటికెడు ధనియాలు లేదా పొడి, పచ్చి మిరపకాయ 1, టమోటా 1, చిన్న నిమ్మకాయంత చింతపండు, మినప పప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు పొడి 1/4 టీస్పూన్, ఆవాలు అవసరమైనంత, అవసరమైనంత మినప పప్పు, జీలకర్ర కొద్దిగా, బెల్ పెప్పర్ 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్ది మొత్తంలో ఆకులు, బెల్లం చిన్న ముక్క, నూనె, ఉప్పు రుచికి సరిపడ
తయారీలోకి వెళ్లితే. . ముందుగా చింత పండు తీసుకోవాలి. చింత పండును వేడి నీటిలో నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు నానబెట్టి, వాటి నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా కంది పప్పు, టమాటాలను తీసుకొని కుక్కర్లో వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీనిని మెత్త మాష్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా, పప్పు మిశ్రమం , తీసుకొని, చింత పండు రసంలో వేసి, అలాగే ఉల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, బెల్లం, రెండు కప్పుల నీరు పోసి మంచిగా కలుపుకోవాలి. అంతే కాకుండా స్టవ్ ఆన్ చేసి పాన్ పైన పెట్టి, కాసేపు రసం పచ్చి వాసన పోయే వరకు మరగబెట్టాలి.
అంతే కాకుండా సూప్ మరుగుతున్న సమయంలో రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం జీలకర్ర , మిరియాలు, ఎండు మిర్చీ, ఎండు కొబ్బరి తురుము,ధనియాలు,వెల్లుల్లి ఇవన్నీ మంచి కలిపి పేస్ట్‌లా తయారు చేసుకొని రసంలో వేయాలి. ఇది రసానికి మంచి ఘాటును ఇస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం పాన్ పెట్టి, అందులో సరిపడ నూనె వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు, పసుపు వేసి మంచిగా పోపు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత రస ఇందులో వేయాలి. అంతే టేస్టీ టేస్టీ చెట్టి నాడ్ స్టైట్ ఉల్లిపాయ రసం రెడీ.





