తాజావార్తలు

Tollywood : నా పొగరే నేను డౌన్ ఫాల్ కావడానికి కారణం.. ఇప్పటికీ ఫీలవుతున్నా.. టాలీవుడ్ నటుడు..


టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో, ప్రత్యేకమైన మ్యానరిజమ్స్‌తో కమెడియన్‌గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చిత్రం శ్రీను. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉండి, మంచి స్టార్‌డమ్‌ను అనుభవించిన ఆయన.. ఆ తర్వాత కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులను తన విజయాల వెనుక ఉన్న అనుభవాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్ పతనం కావడానికి తనలోని అహంకారమే (పొగరు) కారణమని అన్నారు. ఒకానొక దశలో వరుసగా నాలుగు, ఐదు సినిమాలు షూట్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నానని, ఆ సమయంలో డబ్బును విపరీతంగా ఖర్చు పెట్టానని చిత్రం శ్రీను గుర్తుచేసుకున్నారు. “నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను, ఈరోజు ఖర్చు పెడితే రేపు మరో సినిమా వస్తుంది” అనే అతి విశ్వాసం , పొగరు తన జీవితంలో పెద్ద దెబ్బ కొట్టాయని ఆయన పేర్కొన్నారు. ఆ రోజుల్లో సంపాదించిన డబ్బును సరిగ్గా పొదుపు చేసుకోలేదని, ప్లాట్లు కొనే అవకాశం ఉన్నప్పటికీ పార్టీల పేరుతో విలువైన డబ్బును వృధా చేశానని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

అయితే, కాలం నేర్పిన పాఠాలతో తాను చాలా విషయాలు తెలుసుకున్నానని చిత్రం శ్రీను తెలిపారు. కెరీర్‌లో డౌన్‌ఫాల్ వచ్చినప్పుడు స్నేహితులు అందించిన సహకారాన్ని, ముఖ్యంగా డైరెక్టర్ వేణు మరియు నటుడు శ్రీనివాస్ రెడ్డి తనను ఎంతగానో ఆదుకున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుని, ప్రస్తుతం ఎలాంటి పాత్ర వచ్చినా మరింత క్రమశిక్షణతో, అంకితభావంతో ముందుకు సాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఎవరి జీవితంలోనైనా క్రమశిక్షణ, ముందుచూపు చాలా ముఖ్యమని ఆయన యువ నటులకు సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

పలు సినిమాలలో తనదైన ముద్ర వేసుకున్న శ్రీను, ప్రత్యేకించి ఒక సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ, దానిని చాలా మంది రెప్లికేట్ చేయడానికి ప్రయత్నించారని గుర్తు చేసుకున్నారు. తన తరం వారు ఇప్పటికీ తనను “రాంబాబు” అని పిలుస్తారని ఆయన వివరించారు. ఒకానొక దశలో చిత్ర పరిశ్రమ నుండి తన ఫోన్‌కు కాల్స్ రావడం మానేశాయని, అప్పుల వారు మాత్రమే ఫోన్ చేసే రోజులు ఉండేవని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి క్లిష్ట సమయంలో, రాజా ది గ్రేట్ చిత్రం విడుదలైన తర్వాత తన ఫోన్ మళ్లీ మొదటిసారి మోగిందని స్టేజ్ మీద స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

చిత్రం శ్రీను..

Chitram Srinu Movie

Chitram Srinu Movie

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *