ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. తూర్పుమధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నంకు 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నంకు 1020 కి.మీ., బాపట్లకు 1100 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ప్రకటించింది. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం ఉదయానికల్లా తూర్పు మధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశముందని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా బలపడే అవకాశముందని వెల్లడించారు. ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి అతి తీవ్ర తుపానుగా బలపడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్
బుధవారం ఉదయానికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకొని బాపట్ల – విశాఖపట్నం మధ్య అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ముందని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిమీ గరిష్టంగా 140 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ముందని హెచ్చరించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. తీవ్ర తుఫాన్ క్రమంలో సముద్ర అల్లకల్లోలంగా మారుతుంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం కృష్ణా , బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ తెలిపారు.
🛑 సోమవారం ఉదయానికల్లా తూర్పు మధ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం
🛑 మంగళవారం ఉదయం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా బలపడే అవకాశం
🛑 ఆ తర్వాత,ఇది వాయువ్య దిశగా పయనించి అత్యంత తీవ్ర తుపానుగా బలపడే ఛాన్స్
#CycloneAlert #cyclones #WeatherUpdate #heavyrains— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 24, 2026
తెలంగాణలో వర్షాలు
ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి. రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాలులు బలంగా వీచే అవాకశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
