Finn Allen Daryl Mitchell Catch: క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న భారత్ vs న్యూజిలాండ్ రెండో టీ20 (IND vs NZ 2nd T20I)లో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) తన రెండో ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. తొలుత శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను పెవిలియన్‌కు పంపిన సాంట్నర్.. అదే ఓవర్‌లో అక్షర్ పటేల్ (Axar Patel)ను కూడా అవుట్ చేశాడు.
అక్షర్ పటేల్ క్రీజు నుంచి ముందుకు వచ్చి సాంట్నర్ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే సాంట్నర్ బంతి వేగాన్ని తగ్గిస్తూ లెంగ్త్‌ను మార్చడంతో అక్షర్ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు.
ఎక్కువమంది చదివినది: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డ్.. ఒకే ఏడాదిలో దుమ్మురేపాడుగా..!
బంతి లాంగ్-ఆన్ వైపు గాల్లోకి వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిన్ అలెన్ (Finn Allen) అద్భుతమైన వేగంతో వెనక్కి పరిగెత్తి బౌండరీ లైన్ సమీపంలో బంతిని అందుకున్నాడు. అయితే అతడి వేగం కారణంగా బౌండరీ దాటే ప్రమాదం ఉండటంతో క్యాచ్‌ను పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాడు.
ఫిన్ అలెన్, డారిల్ మిచెల్‌ల కళ్లు చెదిరే క్యాచ్ వీడియో..
🚨 Finn Allen & Daryl Mitchell turned the rope into no man’s land and sent Axar Patel packing.😱 https://t.co/ceeLthCNP3
— Prasant Kumar Nayak (@klassic_prasant) October 24, 2026
అయినా అలెన్ తెలివిగా బంతిని గాల్లోకి విసిరాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న డారిల్ మిచెల్ (Daryl Mitchell) బంతిని అందుకుని క్యాచ్‌ను పూర్తి చేశాడు. దీంతో అక్షర్ పటేల్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ 2nd T20I: 1434 రోజుల తర్వాత తొలి వికెట్.. ఆ విమర్శలకు ఇచ్చిపడేసిన స్వింగ్ హీరో..!
ఫిన్ అలెన్, డారిల్ మిచెల్ కలిసి చేసిన ఈ రిలే క్యాచ్ న్యూజిలాండ్ ఫీల్డింగ్ స్థాయిని మరోసారి చూపించింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత్‌కు అక్షర్ వికెట్ కీలక సమయంలో రావడంతో న్యూజిలాండ్ మ్యాచ్‌పై పట్టు మరింత బిగించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
