తాజావార్తలు

ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్


ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్

నవంబర్ 5న విడుదలవుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్‌లో దూసుకుపోతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. దసరా సందర్భంగా యష్ రావణుడిగా నటించిన రావణ తాండవం గ్లిమ్స్ విడుదలై అంచనాలను పెంచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, గ్రాండ్ ఈవెంట్‌లతో సినిమా దేశవ్యాప్తంగా భారీ బజ్‌ను సృష్టిస్తోంది.

నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ: రైస్ ఆఫ్ ఏ లెజెండ్ చిత్రం ప్రమోషన్స్‌లో చిత్ర బృందం దూసుకుపోతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమీత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మెగా మైథలాజికల్ విజువల్ వండర్ కోసం మేకర్స్ గ్రాండ్ ఈవెంట్స్, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో హైప్‌ని పీక్స్‌కి తీసుకెళ్తున్నారు.రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ మూవీ ఇప్పటికే ఇంటర్నేషనల్ ట్రైలర్‌తో పాటు హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో వరుస ప్రమోషనల్ ఈవెంట్‌లతో దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా దసరా పండుగని పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకున్న రామాయణ టీం, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ విశ్వరూపాన్ని చూపిస్తూ స్పెషల్ మ్యూజికల్ అప్‌డేట్‌ రావణ తాండవంని విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *