అమరావతి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. రాష్ట్రంలోని 13 విభిన్న శాఖల్లో మొత్తం 166 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు అవకాశం ఉంది. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), మున్సిపల్ కమిషనర్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వంటి కీలక ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశం.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి రోజుల్లో వెబ్‌సైట్‌పై రద్దీ పెరిగి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడం మంచిది. అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ను సందర్శించాలి. అవసరమైన వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) నమోదు చేసుకుని, సూచించిన విధంగా ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. దరఖాస్తు సమర్పించే ముందు వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైన పత్రాలు, ఫీజు చెల్లింపు తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తనిఖీ చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్) 2027 జనవరి 24న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు సమాచారం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షకు సిద్ధమవుతూ, సిలబస్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా చదవడం ప్రారంభించాలి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసే సర్వీసులు ఇవే..
- డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య: 11
- ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల సంఖ్య: 14
- డీఎస్పీ సివిల్ పోస్టుల సంఖ్య: 36
- డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టుల సంఖ్య: 3
- డీఈవో పోస్టుల సంఖ్య: 14
- ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
- ఆర్టీవో పోస్టుల సంఖ్య: 3
- డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ సర్వీసెస్ పోస్టుల సంఖ్య: 15
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టుల సంఖ్య: 12
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 2
- డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 3
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 14
- డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 35
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 27, 2026, రాత్రి 11:59 గంటలు. గ్రూప్-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, డీఈఓ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ తదితర 13 రకాల కీలక సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
