కొన్నిసార్లు జీతం ఆలస్యంగా జమ కావడం, బ్యాంకింగ్ సిస్టమ్లో టెక్నికల్ సమస్యలు, ఆటో డెబిట్ ఫెయిల్ కావడం వంటి కారణాలతో ఈఎంఐ చెల్లించడం ఆలస్యం కావొచ్చు. కొంతమంది ఒక్క ఈఎంఐ లేట్ అయితే ఏమీ కాదని పొరపడుతుంటారు. కానీ ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం జరిగితే భారీగా పెనాల్టీలు పడతాయి. ఆలస్యపు రుసుంలు, పెనాల్టీలు పెద్ద మొత్తంలో కట్టాల్సి వస్తుంది. దీంతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.
