తాజావార్తలు

దండారి పండుగ ప్రత్యేకత ఇదే.. తుడుం మోతలు, గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీ గూడాల్లో సందడి!


దండారి ఉత్సవాల్లో అకాడి రోజుకి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండుగలో మాత్రమే వాడే గుమేల, పర్ర, పెట్టె అనే వాయిద్యాలను బయటకు తీసి అలంకరిస్తారు. వాటితో పాటు టప్పల్, కోడల్ అనే ముఖానికి పెట్టుకునే కవచాలు, గుస్సాడీల కంకాలి టోపీలు, ఆభరణాలు, మంత్రదండం, మెడలో రుద్రాక్షలు, రోకళ్లతో సామూహికంగా పూజ చేసి.. వాయిద్యాలను మోగిస్తారు. వీటికి నైవేధ్యం సమర్పించడంతో దండారీ వేడుకలు మొదలవుతాయి. ఒక ఊరి దండారి బృందం రెండు, మూడు ఊళ్లకు వెళ్తుంది. తెల్లని ధోతులు, నడుముకు, తలకూ తెల్లని లేదా ఎరుపు, ఆకుపచ్చ రంగుల రుమాళ్ళు కట్టుకొని.. కోలలు పట్టుకొని నృత్యాలు చేస్తారు.
తుడుం మోతతో మొదలై.. గుస్సాడీల నృత్యాలతో ఉత్సాహాన్ని నింపుతూ.. కొలబొడితో ముగిసే దండారి ఉత్సవాలు ఆదివాసీ గూడాల్లో కొత్త కళను తీసుకొస్తాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం.. ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించే సజీవ వారసత్వంగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *