తాజావార్తలు

Video: ఒక వైపు తన పెళ్లి.. మాజీ ప్రియురాలితో తన బిడ్డ వేడుక! రెండూ ఒకే రోజు..


China Mans Wedding Day With New Partner Coincides With Ex Girlfriends Baby Celebration

చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి పెళ్లి, మాజీ ప్రియురాలితో అతనికి కలిగిన బిడ్డకు సంబంధించిన వంద రోజుల వేడుక ఒకే రోజు, ఒకే హోటల్‌లో జరగడంతో కలకలం రేగింది. ఆ వ్యక్తి పై అంతస్తులో తన భార్యతో రిజిస్టర్ వివాహం చేసుకుంటుండగా, కింది అంతస్తులో అతని మాజీ ప్రియురాలు వారిద్దరికీ పుట్టిన బిడ్డకు సంబంధించిన సాంప్రదాయక వేడుక చేసింది. రెండు వైపులా కుటుంబ సభ్యులు, బంధువులు ఒకరికొకరు ఎదురుపడటంతో హోటల్‌లో పెద్ద గొడవ జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు

స్థానిక అధికారులు దీనిపై స్పందిస్తూ, సదరు వ్యక్తి చట్టబద్ధంగా ఒక యువతిని మాత్రమే వివాహం చేసుకున్నాడని, మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. అందువల్ల అది చట్ట ప్రకారం బహుభార్యాత్వం (Bigamy) నేరం కిందకు రాదని తేల్చారు. అయితే  వీరి మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం ఇంకా పరిష్కారం కాలేదనీ తెలుస్తోంది. ఒకే వ్యక్తికి సంబంధించిన ఈ రెండు వేడుకలు ఒకే రోజు, ఒకే చోట జరగడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి

ఒకే భవనంలో రెండు వేడుకలు.. అసలు విషయం తెలిసి షాక్!

అక్టోబర్ 9న గుయిజౌ ప్రావిన్స్‌లోని లియుపాన్‌షుయ్ లో ఈ వింత ఘటన జరిగింది. వు అనే వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడు. అదే సమయంలో అతడి మాజీ ప్రియురాలికి అతనికి పుట్టిన బిడ్డకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా వేడుక నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాల కోసం వేర్వేరుగా హాళ్లను బుక్ చేసుకున్నారు. ఒకే భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో వేడుకలు జరుగుతున్నాయి. అయితే, రెండు కార్యక్రమాల వెనుక ఉన్న వ్యక్తి ఒక్కరేనన్న విషయం ఎవరికీ తెలియలేదు.

అతిథులు ఎదురుపడటంతో మొదలైన వివాదం

రెండు వేడుకలకు వచ్చిన అతిథులు అనుకోకుండా భవనంలో ఎదురుపడ్డారు. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది. అప్పటివరకు సాధారణంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో భవనంలోని సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పై అంతస్థులో వూ  పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ షాక్ కు గురైంది. ఆమె చిన్నారిని ఎత్తుకుని పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించింది.  మెట్ల మీద కొందరు ఆమెను వారించారు.  ఆ మహిళ వారిని పక్కకు జరగాలని కోరింది. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మరో వ్యక్తి మెట్లపై నుంచి కిందకు వచ్చి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.  ఈ విచిత్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టీవీ సీరియల్‌లో వచ్చే సన్నివేశంలా ఉందని కామెంట్‌ చేస్తున్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *