రోడ్డుపై పెద్ద ఎత్తున చెత్తా చెదారం, ఇతర వస్తువులు మండుతుంది. వాటి నుంచి దట్టమైన నల్లటి పొగలు పైకి ఎగసిపడుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఓ మహిళ మాత్రం తనకేమీ సంబంధం లేనట్లుగా జాగింగ్ కొనసాగించింది. అథ్లెటిక్ దుస్తులు ధరించిన ఆమె.. ఎలాంటి ఆందోళన లేకుండా సాధారణంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తున్నట్లుగా తన వేగాన్ని కొనసాగించింది. చుట్టూ ఏం జరుగుతోందనే విషయాన్ని పట్టించుకోనట్లుగా కనిపించింది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
The most dystopian fitness video on the internet just dropped. 🚨💀
Paris is literally burning, protesters are shutting down the streets, and this woman is casually jogging past a burning barricade like it’s a treadmill session. She is literally running through thick black smoke because hitting her daily step count is a higher priority than whatever revolution is happening around her.
Pure, unfiltered main character syndrome. The absolute disrespect to the entire riot.
— Atulya (@DesiMemesTweets) October 18, 2026
‘అల్లర్లు జరిగినా.. బరువు తగ్గాల్సిందే!’
ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఫ్రెంచ్ భాషలో ఓ క్యాప్షన్ ఇచ్చారు. దాని అర్థం.. ‘వీధుల్లో గందరగోళం జరుగుతున్నా.. బరువు తగ్గాల్సిందే’. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ క్లిప్‌కు 19 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఆమె పెట్టుబడిదారీ వ్యవస్థతో కాదు.. తన శరీరంలోని జీవక్రియతో పోరాడుతోంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి.. ’10 వేల అడుగులు నడవాలనే లక్ష్యాన్ని చిన్నపాటి అల్లర్లు కూడా ఆపలేవు’ అని కామెంట్ చేశారు. ఇంకొకరు స్పందిస్తూ.. ‘అల్లర్లను ఆమె నియంత్రించలేకపోవచ్చు. కానీ తన దినచర్యను మాత్రం నియంత్రించగలదు’ అని రాసుకొచ్చారు. మరో నెటిజన్.. ‘ఫిట్‌నెస్‌పై అంత నిబద్ధత ఉండటం ఆశ్చర్యంగా ఉంది. చుట్టూ అల్లర్లు జరుగుతున్నా ఏమీ జరగనట్లుగా జాగింగ్ చేయడం మామూలు విషయం కాదు’ అని వ్యాఖ్యానించారు. అయితే, కొందరు మాత్రం ఆమె ప్రవర్తనను సాధారణంగానే చూస్తున్నారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ్రాన్స్‌లో నిరసనలు ఎందుకు?
ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. మొదట పాఠశాలల్లో పరిస్థితులు సరిగా లేవంటూ విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం.. ఆ తర్వాత వేరు వేరు సమస్యలపై ఆందోళనగా మారింది. లక్షలాది మంది ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేపట్టగా.. కొందరు హింసాత్మక నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులు ఆపడం లేదు. ఖరీదైన దుకాణాలు, సూపర్ మార్కెట్లలో దోపిడీలు చేస్తున్నారు. పోలీసు వాహనాలతో పాటు పోలీసు సిబ్బందిపైనా దాడులు చేశారు.
ప్రధాని ఏమన్నారు?
ఈ హింసాత్మక ఘటనలపై ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను స్పందిస్తూ, హింసకు ప్రభుత్వం భయపడదనీ, అల్లర్ల వెనుక అతివామపక్ష శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ‘రాబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ హింసను ఒక సన్నాహక చర్యగా ఒక వార్మప్ గా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. మమ్మల్ని బెదిరించలేరు.. హింస ద్వారా ఎవరూ తమ రాజకీయ ఎజెండాను మాపై రుద్దలేరు’ అని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
