టాలీవుడ్లో మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ, విలక్షణమైన కథలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే పలు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య మార్క్ మాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ స్టైల్ కథనంతోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అభిమానులను ఆకట్టుకునేలా కథను రూపొందిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు
కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమాలోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎంచుకోబోయే సామాజిక అంశం ఏమిటి.? దాన్ని బాలయ్య పాత్ర ద్వారా ఎలా చూపించబోతున్నారు.? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు పెద్దపీట వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కథను మరో మలుపు తిప్పే కీలకమైన ట్విస్ట్ ఉండబోతున్నట్లు సమాచారం.
Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఇప్పుడు సినిమాలకు దూరం ఇలా ..
అదే నిజమైతే ప్రేక్షకులకు థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయం. కొరటాల శివ సినిమాల్లో కథతో పాటు దాని నేపథ్యానికి కూడా ఆయన ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. కథ జరిగే ప్రాంతం, అక్కడి ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులను కథనంలో భాగంగా మలచడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే బాలకృష్ణతో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం ఎలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేవర తర్వాత కొరటాల శివ రూపొందించబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఏడాది మొత్తం విజయ్ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
