తాజావార్తలు

సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. సందడి చేసిన రణబాలి జంట!


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతోంది. తొమ్మిది రోజుల పాటు పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు చేసుకునే ఈ పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అక్టోబర్ 16న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు నుంచి రణబాలి సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అలాగే సినిమా రిలీజ్ తర్వాత ఆ అంచనాలు అందుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా విరోష్ జంట తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొననుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్టార్ జంట సందడి చేయడంతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *