సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో థియేటర్ల వద్ద రజనీ అభిమానుల హంగామా కనిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీతో పాటు పలువురు స్టార్ యాక్టర్స్ కూడా ఉన్నారు. రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, విద్యాబాలన్, ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు, మిథున్ చక్రవర్తి, యోగిబాబు, మీర్నా మీనన్, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్.. ఇలా ఎందరో స్టార్స్ జైలర్ 2లో నటించారు. అయితే ఇదే జైలర్ 2 సినిమాలో టాలీవుడ్ నటి పూర్ణ కూడా భాగమైంది. ఈ సినిమాలోని ‘అలా బోలేలో’ అనే పాటలో రజనీకాంత్ తో కలిసి స్టెప్పులేసింది పూర్ణ. . మాస్, క్లాసికల్ డ్యాన్స్ మిక్స్ చేసి పూర్ణ వేసిన స్టెప్పులు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సంప్రదాయ కేరళ చీరకట్టులో పూర్ణ చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే జైలర్ 2 సినిమా రిలీజ్ వేళ పూర్ణకు కటౌట్ ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. త్రివేండ్రం (తిరువనంతపురం)లోని ఓ థియేటర్ సమీపంలో షమ్నా కాసిమ్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ‘జైలర్ 2’ రిలీజ్ వేళ అన్ని చోట్ల రజనీకాంత్ కటౌట్లు పెట్టారు. అయితే నటి పూర్ణకు కూడా నిలువెత్తు కటౌట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కేరళలో పూర్ణకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
కాగా పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. కేరళలోనే పుట్టి పెరిగింది. మొదట మలయాళంలోనే సినిమాలు చేసింది. ఆ తర్వాతే టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. 2007లో శ్రీహరి హీరోగా వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణకు ‘సీమ టపాకాయ్’, ‘అవును’ సినిమాలు పూర్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కేవలం హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగానూ మెప్పిస్తోంది పూర్ణ.
‘దృశ్యం 2’, ‘అఖండ’, ‘దసరా’, ‘భీమా’, ‘అఖండ 2’ వంటి సినిమాల్లోనూ పూర్ణ నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ లో స్టెప్పులేసిన ఆమె తాజాగా ‘జైలర్ 2’ సినిమాలో అలా బోలేలో అంటూ అలరించింది.
ఇవి కూడా చదవండి
ఇక పూర్ణ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
త్రివేండ్రంలో పూర్ణ కటౌట్..
Shamna Fans Association
#Jailer2 #RajiniKanth https://t.co/hfP13aRSDk
— Milagro Movies (@MilagroMovies) October 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
