తాజావార్తలు

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చేసింది


చాలామంది తమ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఆ సిస్టమ్‌ను ఇతరులు వాడినప్పుడు వ్యక్తిగత చాట్‌లు కనిపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ, వినియోగదారుల వ్యక్తిగత, ముఖ్యమైన సంభాషణలకు పూర్తి భద్రత కల్పించేందుకు వాట్సాప్ ఈ సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అదే రిస్ట్రిక్టెడ్ చాట్.. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఆ చాట్‌లు ఇతరులకు కనిపించవు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత సంభాషనను ప్రైవసీగా ఉంచుతుంది.

రిస్ట్రిక్టెడ్ చాట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ఎలా?

  • మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం చాలా సులభం
  • మీరు రహస్యంగా ఉంచాలనుకుంటున్న కాంటాక్ట్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేయండి.
  • కిందికి స్క్రోల్ చేస్తే ‘రిస్ట్రిక్టెడ్ చాట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అవసరం లేదని భావిస్తే ఎప్పుడైనా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు.

రిస్ట్రిక్టెడ్ చాట్ వల్ల కలిగే ప్రయోజనాలు:

  • లింక్డ్ డివైజ్‌లలో కనిపించవు: మీ వాట్సాప్‌ను ఇతర కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లకు లింక్ చేసినప్పటికీ, ఈ రిస్ట్రిక్టెడ్ చాట్‌లు వాటిలో కనిపించవు; మెసేజ్‌లు కూడా లోడ్ కావు.
  • మీడియా భద్రత: ఈ చాట్‌లలో వచ్చే ఫొటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలోకి ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వవు.
  • ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉండదు: ఈ సంభాషణలను ఇతర రూపాల్లోకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి వీలుపడదు.
  • మెటా ఏఐ రక్షణ: ఈ చాట్‌లలో మెటా ఏఐ (Meta AI) ఫీచర్లు పనిచేయవు.
  • సున్నితమైన, అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచాలనుకునే వారికి ఈ కొత్త ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *