తాజావార్తలు

‘ఆ సమయంలో బాగా ఏడ్చాను.. నా కెరీర్‌లో అత్యంత చీకటి రోజులవే..’: రోహిత్ శర్మ


Rohit Sharma Emotional: రోహిత్ శర్మ (Rohit Sharma) భారత క్రికెట్ చరిత్రలో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. అయితే అతడి కెరీర్‌లో ఒక దశ మాత్రం తీవ్ర ఇబ్బందులతో నిండిపోయింది. తాజాగా ఆ కఠిన సమయాన్ని రోహిత్ గుర్తుచేసుకుంటూ కీలక విషయాలను వెల్లడించాడు.

కెరీర్‌లో అత్యంత కష్టమైన సమయం ఏదంటే..?

విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించిన రోహిత్ శర్మ.. టీమిండియా ఓపెనర్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే అతడి కెరీర్ విజయాలతో మాత్రమే సాగలేదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు. అలాంటి ఓ దశ తనను మానసికంగా తీవ్రంగా దెబ్బతీసిందని హిట్‌మ్యాన్ తాజాగా గుర్తుచేసుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే.. ఫ్యూచర్ చెప్పేసిన ఆసీస్ దిగ్గజం..!

ఇవి కూడా చదవండి



2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి..

మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన షో ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’లో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఎదురైన ఓటమి తన కెరీర్‌లోనే అతిపెద్ద షాక్ అని చెప్పాడు. ‘‘అది నా కెరీర్‌లో అత్యంత కఠినమైన దశ. 2007 నుంచి ఇప్పటివరకు అలాంటి సమయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మేము అంత అద్భుతంగా ఆడుతున్న సమయంలో ఓటమి వస్తుందని అసలు ఊహించలేదు. కానీ క్రీడల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. అంతా సవ్యంగా సాగుతోందని అనిపించే సమయంలోనే ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మనల్ని కిందకు పడేసే సంఘటనలు ఎదురవుతాయి. క్రీడలు మనకు ఇదే విషయాన్ని నేర్పిస్తుంది’’ అని రోహిత్ చెప్పాడు.

2024 టీ20 ప్రపంచకప్ విజయంపై రోహిత్ ఏమన్నాడంటే..?

2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ సాధించిన అద్భుత విజయాన్ని గుర్తుచేసుకున్న రోహిత్ శర్మ.. 2023 వన్డే ప్రపంచకప్ ఓటమి తమలో గెలవాలనే ఆకలిని మరింత పెంచిందని చెప్పాడు. ‘‘2024 టీ20 ప్రపంచకప్‌లో ఆ స్థాయిలో గెలవాలనే తపన, పట్టుదల మనలో ఉండేవి కావేమో. ఆ ఓటమి ఎదురుకాకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. వైఫల్యం.. విజయంతో పోలిస్తే మనకు చాలా ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. ప్రతి నవంబర్ 19 తర్వాత జూన్ 29 వస్తుంది’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

ఎక్కువమంది చదివినది: గంభీర్ నమ్మకానికే వెన్నుపోటు.. కట్‌చేస్తే.. హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురు బెంచ్‌కే ఫిక్స్..!

నవంబర్ 19.. జూన్ 29 ఎందుకు కీలకం..?

2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగింది. టోర్నీలో గ్రూప్ దశ నుంచి నాకౌట్ వరకు అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. టోర్నీ మొత్తం అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ.. టైటిల్ పోరులో విజయం సాధించలేకపోవడం భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఆ ఓటమి తర్వాత ఏడాది కూడా గడవకముందే.. 2024 జూన్ 29న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. అందుకే రోహిత్ శర్మ తన మాటల్లో ‘‘ప్రతి నవంబర్ 19 తర్వాత జూన్ 29 వస్తుంది’’ అంటూ ఆ రెండు రోజులను తన కెరీర్‌లోని రెండు భిన్నమైన భావోద్వేగాలకు ప్రతీకగా పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *