తాజావార్తలు

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షల జీతం


ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం. దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2027లో ప్రారంభమయ్యే 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-145)లో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సు ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • సివిల్ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 8
  • కంప్యూటర్ సైన్స్ పోస్టుల సంఖ్య: 6
  • ఎలక్ట్రికల్ పోస్టుల సంఖ్య: 2
  • ఎలక్ట్రానిక్స్ పోస్టుల సంఖ్య: 6
  • మెకానికల్ పోస్టుల సంఖ్య: 6
  • ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ పోస్టుల సంఖ్య: 2

సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లికేషన్‌ చేసుకునేందుకు అర్హులు. అయితే వారు 2027 జులై 1 నాటికి తమ డిగ్రీ లేదా మార్కుల మెమోలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి 2027 జులై 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంటే అభ్యర్థి 2000 జులై 1 కంటే ముందు, 2007 జూన్ 30 తర్వాత జన్మించి ఉండకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత తదుపరి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి



ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *