తాజావార్తలు

దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి


Maharashtra Tragedy: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివేగర్‌ బీచ్‌కు పిక్నిక్‌ కోసం వెళ్లిన విద్యార్థుల్లో ఎనిమిది మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పుణె జిల్లాలోని ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మొత్తం 48 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు దివేగర్‌ బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు సముద్రంలో ఈతకు వెళ్లారు. అయితే సముద్ర ప్రవాహం ఒక్కసారిగా ప్రమాదకరంగా మారడంతో ఎనిమిది మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో పోలీసులు, స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గల్లంతైన ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

సముద్ర ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *