తాజావార్తలు

ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత విషయంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం, చిప్‌మేకర్ ఎన్విడియా కీలకమైన ముందడుగు వేసింది. ఏఐ ఏజెంట్లు అదుపు తప్పకుండా పర్యవేక్షించేందుకు 100కు పైగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి ‘ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్’ అనే కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ఇటీవల కొన్ని ఏఐ వ్యవస్థలు స్పష్టమైన ఆదేశాలు లేకుండానే ప్రభుత్వ, కార్పొరేట్ సైట్లలోకి చొరబడ్డాయనే వార్తలు కలకలం రేపాయి. దీంతో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ అధిపతులు ఏఐపై కఠిన నియంత్రణలు ఉండాలని డిమాండ్ చేశారు. అయితే, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఈ వాదనలతో విభేదించారు. ఏఐ వల్ల మానవాళికి పెను ముప్పు ఉందనే భయాలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వ నిబంధనలు పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ భద్రత సాధించినప్పుడే దాని పూర్తి సామర్థ్యం సమాజానికి అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ భద్రతా టూల్‌తో పాటు ఎన్విడియా మరో చారిత్రాత్మక ప్రకటన చేసింది. కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏకంగా 150 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.12.5 లక్షల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. గతంలో ఆపిల్ పేరిట ఉన్న 110 బిలియన్ డాలర్ల బైబ్యాక్ రికార్డును ఎన్విడియా అధిగమించింది. ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న భారీ నగదు నిల్వలు, దీర్ఘకాలిక అవకాశాలపై ఉన్న బలానికి ఇది నిదర్శనమని తెలిపింది. ప్రస్తుతం ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 5.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్‌.. పప్పుల ధరలకు రెక్కలు

కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మాస్టర్‌ ప్లాన్‌.. ఇక ఎవరూ తప్పించుకోలేరు!

పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *