
వానరం చేష్టలు మనల్ని ఎంతలా నవ్విస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..కోతి చేసే పనులు కొన్న ఇసార్లు కోపం, చిరాకు కూడా తెప్పిస్తాయి. కానీ, జార్ఖండ్ రాజధాని రాంచీలో మాత్రం ఒక కోతి చేసిన పని అందరినీ షాక్ అయ్యేలా ఉంది. ఈ అరుదైన, హాస్యస్పద దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు తమ స్మార్ట్ఫోన్లలో రికార్డ్ చేసి నెట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. అసలేం జరిగింది?
రాంచీ ప్రాంతంలోని ఒక వైన్ షాప్ వద్దకు హఠాత్తుగా ఒక కోతి వచ్చింది. దుకాణం కౌంటర్ వద్దకు వచ్చిన ఆ కోతి, అక్కడున్న మద్యం సీసాలపై కన్నువేసింది. ఏమాత్రం భయం లేకుండా ఒక సీసాను తీసుకుని, దాని మూత తెరిచి గుటగుటా తాగడం ప్రారంభించింది. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన షాపు యజమాని, మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
అంతటితో ఆగకుండా, ఆ కోతి తన వైఖరితో అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది. వైన్ షాప్కు వచ్చిన కొందరు కస్టమర్ల వద్ద ఉన్న సీసాలను కూడా లాక్కోవడానికి ప్రయత్నించింది. కొందరు వ్యక్తులు కోతిని బెదరగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, అది ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మద్యం చుక్కల కోసం పట్టుబట్టింది. స్థానికులు కొందరు ఈ క్రమంలో కోతికి నామ్కీన్, ఆహారం అందించినప్పటికీ, దాని దృష్టి మాత్రం మద్యం సీసాపైనే ఉండటం విశేషం.
ఈ విచిత్ర విన్యాసాన్ని అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేశారు. వీడియో నెట్లో ప్రత్యక్షమైన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో వైరల్గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల హాస్యస్పద కామెంట్లు చేస్తున్నారు. ఈ కోతికి కూడా వీకెండ్ మూడ్ వచ్చిందేమో!, మద్యం ప్రియుడైన కోతి అంటూ సరదాగా స్పందిస్తున్నారు.
జంతువులలో మానవ అలవాట్లు లేదా ప్రవర్తన కనిపించినప్పుడు ఇలాంటి సంఘటనలు విపరీతమైన ఆసక్తిని కలిగిస్తాయి. రాంచీలోని ఈ తాగుబోతు కోతి వీడియో ప్రస్తుతం నెటిజన్లకు కావలసినంత వినోదాన్ని అందిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
