తాజావార్తలు

TV9 Festival: అక్టోబర్ 16 నుంచి 20 వరకు టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సంబరాలు.. టికెట్ల బుకింగ్‌ ప్రారంభం


TV9 Festival of India Celebrations: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సంబరాలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 16 నుంచి 20 వరకు మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, వినోదాల కలబోతగా సాగే ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా సంగీత ప్రియుల కోసం లైవ్ కాన్సర్ట్‌లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక లైవ్ కాన్సర్ట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

హర్షదీప్ గాన లహరి.. రఫ్తార్ రాప్ పవర్:

అక్టోబర్ 16: తొలిరోజు ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ తన మధురమైన, భావోద్వేగపూరిత గళంతో సంగీత ప్రియులను అలరించనున్నారు. సూఫీ, బాలీవుడ్ గీతాలతో స్టేడియంలో శ్రోతలను మంత్రముగ్ధులను చేయనున్నారు.

అక్టోబర్ 17 : రెండో రోజు యువతను ఉర్రూతలూగించేందుకు ప్రముఖ ర్యాపర్ రఫ్తార్ రంగంలోకి దిగుతున్నారు. హై-వోల్టేజ్ బీట్స్, పవర్-ప్యాక్డ్ హిప్-హాప్ ప్రదర్శనతో స్టేడియంలో జోష్ నింపనున్నారు.

టికెట్ల విక్రయం ప్రారంభం:

ఈ రెండు రోజుల మెగా కాన్సర్ట్‌లకు సంబంధించిన టికెట్లు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున జరిగే ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సంగీత ప్రియులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో సంగీత విభావరితో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *