తాజావార్తలు

Janasena : తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. నకిరేకల్ సభలో క్లారిటీ ఇచ్చిన స్టేట్ ఇంఛార్జ్?


తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా అనే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో జరిగినే అన్ని ఎన్నికల్లో జనసేన పోలీ చేస్తుందని.. తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పొత్తుల విషయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూసుకుంటరని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.

నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి అధ్వర్యంలో నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే, ఎన్నికల్లో పోటీకి అవసరమైన ప్రణాళికలతో ఇకపై ముందుకెళ్తామని అన్నారు. జనసేనలో కార్యకర్తలకు ఖచ్చితమైన గౌరవం, భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో భాగంగా నకిరేకల్ బస్ స్టాండ్ ప్రాంతం నుంచి నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్ వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు.

నల్గొండ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన ‘సాధక్’లను సత్కరించారు. 2014 నుండి జనసేన తరపున వివిధ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, ప్రజీత్ గౌడ్, మీసాల శ్రీనివాస్, మేడా రామకృష్ణ, శ్రీధర్ శర్మ, జిల్లా నాయకులు సరికొప్పుల విజయలక్ష్మీ, నాగేశ్వర్ రావు, పవన్, విక్కీ జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నరు.

Jsp

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *