స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా స్వీట్ తింటుంటారు. అయితే రోజు మనం తినే స్వీట్స్ కంటే, పాతకాలం వారి ఫేవరెట్ స్వీట్ వెన్నె ఉండలు ఒక్కసారి తింటే ఆ రుచే అద్భుతంగా ఉంటుందంట. మరి మనం వీటిని మన ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
వెన్నె ఉండల కోసం మొదటగా, ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆరు గంటలపాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానిన తర్వాత నీటిని వంపేసి, ఒక కాటన్ వస్త్రంపై పలుచగా పరచి నీడలో ఆరబెట్టుకోవాలి. బియ్యం పూర్తిగా ఎండిపోకూడదు, చేతితో తాకితే కొద్దిగా చల్లగా, తడి తడిగా ఉండాలి. అరిసెల పిండికి ఆరబెట్టినట్లుగా ఆరబెట్టాలి.ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లెడ పట్టి, జల్లించుకోవాలి. రవ్వ మిగిలితే మళ్ళీ గ్రైండ్ చేసి జల్లించుకోవాలి. మెత్తని తడి బియ్యప్పిండిని పక్కన పెట్టుకోవాలి.
మెత్తగా జల్లించిన బియ్యప్పిండిలో రెండు చిటికెల ఉప్పు, పావు కప్పు వెన్న వేసుకోవాలి. వెన్న, బియ్యప్పిండి బాగా కలిసేలా చేతితో రుద్దుతూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల వెన్న పిండికి బాగా పడుతుంది.తరువాత, కొద్దికొద్దిగా పచ్చిపాలు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తడిపిండి కాబట్టి ఎక్కువ పాలు పట్టవు, రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పాలు సరిపోతాయి. పిండి పల్చగా అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కనీసం ఐదు నిమిషాలపాటు బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉండలు చేసేటప్పుడు పగుళ్లు రాకుండా వస్తాయి. కలిపిన పిండితో చిన్న బాల్ చేసి చూస్తే, పగుళ్లు లేకుండా ఉండలా రావాలి. పిండిని ఆరిపోకుండా ఒక దగ్గరగా చేసి పెట్టుకోవాలి.
కలిపిన పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకుంటూ, మధ్యలో ఖాళీ లేకుండా గట్టిగా నొక్కుతూ, పగుళ్లు రాకుండా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే తయారు చేసుకుని, ఆరిపోకుండా మూతతో కప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత కొన్ని వెన్న ఉండలను వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒకటి లేదా రెండు నిమిషాలపాటు ఆగి, నిదానంగా కదుపుకుంటూ అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వేగిన ఉండలను నూనెలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
Venna Undalu 5





