ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. ‘ బి గ్ బాస్ అనేది చాలా పెద్ద ఫ్లాట్‌ఫాం అని. నేను ఇక్కడ ఫిట్ అవుతానని అనుకోలేదు. ఈ విషయమై రోజు రాత్రి నిద్రపోయే ముందు తనని తాను ప్రశ్నించుకునేదాన్ని. ఆ తర్వాతే ఈసారి కచ్చితంగా బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది వర్షిణీ. క ఇక ఈ యాంకరమ్మ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఓ తమిళ కుటుంబంలో పుట్టింది. బుల్లితెరకు రాకముందే వెండితెరపై కనిపించింది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన ‘చందమామ కథలు’ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది వర్షిణీ. దీని తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర సినిమాల్లో నటించింది. అలాగే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌లోనూ మెయిన్ లీడ్ చేసింది.
ఇక బుల్లితెరపై యాంకర్ గానూ, హోస్ట్ గానూ సత్తా చాటింది వర్షిణీ. ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ సందడి చేసింది. కాగా సినిమాలు, టీవీ షోలతో పాటు ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలిచింది వర్షిణీ. ముఖ్యంగా టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందని రూమర్స్ కూడా వినిపించాయి. అలాగే ఒక టీవీ షో డైరెక్టర్‌తోనూ ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. కాగా ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు టీవీ షోలేం చేయట్లేదు వర్షిణీ. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆమె ఇక్కడ సత్తా చాటి మళ్లీ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిస్తోంది.
బిగ్ బాస్ షోతో వర్షిణీ బౌన్స్ బ్యాక్ అయ్యేనా?
A graceful entry into BIGG BOSS Season 10 🔥
House lo #Varshini aata modhalupedithe ela untundho chudadaniki siddama? 👁️Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/vEyxUlWO6D
— Starmaa (@StarMaa) September 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
