తాజావార్తలు

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..


ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (సెప్టెంబర్ 3, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా సమసిపోతాయి. కొన్ని శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మిథునం రాశివారిని వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు కూడా మారే అవకాశం ఉంది. కాగా, మేషం నుంచి మీనం వరకు గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవు తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా సమసిపోతాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా కొన్ని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు కూడా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి సంబంధమైన కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇంటా బయటా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి. ప్రధాన విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి సమస్యలు చాలావరకు చక్కబడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. పని ఒత్తిడి నుంచి చాలావరకు ఉపశమనం లభి స్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు నిదానంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అవసర సమయాల్లో బంధుమిత్రుల సాయం లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఉన్నా లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనలకు విలువనిస్తారు. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు పెరగడానికి బాగా అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి బాగా తగ్గుతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగ్గా, అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

వృత్తి, ఉద్యోగాలలో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. కుటుంబ విషయాల్లో వీలైనంత పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. బంధువుల నుంచి శుభవార్త వింటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *