తాజావార్తలు

Money Astrology: దుస్థాన బుధుడు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!


బుద్ధి కారకుడైన బుధుడు దుస్థానాల్లో ఉన్న పక్షంలో అది కొన్ని రాశులకు తప్పకుండా ఇబ్బందులు, కష్టనష్టాలు కలిగిస్తుంది. పొరపాట్లు చేయడం, తొందరపాటు నిర్ణయాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అనాలోచితంగా వ్యవహరించడం, వివాదాల్లో చిక్కుకోవడం, సలహాలు పనిచేయకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. బుధుడు దుస్థానాల్లో సంచారం చేస్తున్నంత కాలం ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఈ నెల(ఆగస్టు) 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు బుధుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ సమయంలో మేషం, మిథునం, కన్య, మకరం, కుంభం, మీన రాశులవారు గణపతిని తరచూ స్తుతించడం మంచిది.

మేషం

ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు సంచారం చేయడం మంచిదే అయినప్పటికీ, ఈ రాశికి బుధుడు అత్యంత పాప గ్రహం అయినందువల్ల కొన్ని వివాదాలు, సమస్యలు తప్పకపోవచ్చు. మొండిగా వ్యవహరించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తప్పటడుగులు వేయడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం, ఇతరు లకు హామీ ఉండకపోవడం, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం ప్రస్తుతానికి చాలా మంచిది.

మిథునం

బుధ గ్రహం ఈ రాశికి అధిపతి అయినప్పటికీ తృతీయ స్థాన సంచారం ఏమంత మంచిది కాదు. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల ఆర్థికంగా బాగా మోసపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనవసర వాద వివాదాల్లో జోక్యం వల్ల అవమానాల పాలయ్యే సూచనలున్నాయి. సోదరులతో సఖ్యత దెబ్బతింటుంది. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనవసర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఒకటి రెండు దుర్వార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి



కన్య

రాశ్యధిపతి బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో నష్ట పోయే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. సల హాలు, సూచనలు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. నష్టదాయక వ్యవహారాల వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కొందరు సన్నిహితులు మభ్యపెట్టడం, తప్పుదోవ పట్టించడం జరుగుతుంది.

మకరం

ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ప్రతిదీ తానొకటి తలచిన దేవుడు మరొకటి తలచినట్టుగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కలసి రాకపోవచ్చు. నష్టదాయక వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. బంధువులు మోసగించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎక్కడా సంతకాలు చేయవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దు. డబ్బు ఇస్తే తిరిగి రాకపోవచ్చు.

కుంభం

ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడు సంచారం చేయడం ఏమంత మంచిది కాదు. అపార్థాలు, వివాదాలు, విభేదాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఉద్యోగంలో పొరపాట్లు జరగడం వల్ల అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టమైన బంధు మిత్రులు దూరమవుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించకపోవచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధుమిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు కలుగుతాయి.

మీనం

ఈ రాశికి షష్ట స్థానంలో బుధ సంచారం వల్ల శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లది పైచేయి అవుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ విభేదాలు, వివాదాలు ఏర్పడతాయి. హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం వల్ల కష్టనష్టాల పాలవుతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ పొరపాట్లు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టాలు కలుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *