తాజావార్తలు

అక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు.. అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను

అక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు.. అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను


ప్రముఖ తమిళ్ నటుడు జై తన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణం, ఇస్లాం స్వీకరణ, దాని వల్ల తన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. 2011లోనే ఈ ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైందని ఆయన వెల్లడించారు. అంతకుముందు శబరిమల యాత్ర, జీసస్ కోసం రోసరీ మాల ధరించి ఒక సంవత్సరం ఉపవాసం ఉండటం వంటివి చేశానని, అన్ని దేవుళ్లను సమానంగా గౌరవించే మనస్తత్వం తనదని పేర్కొన్నారు. అయితే, కొన్ని అనుభవాలు, సంఘటనల అనంతరం మసీదుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

మసీదులో తొలిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ లైన్‌లో నిలబడి, దైవ ప్రార్థనపైనే పూర్తి శ్రద్ధ పెట్టడం జైని ఎంతగానో ఆకట్టుకుందట. అక్కడ ఎవరూ తనను నటుడిగా గుర్తించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ప్రయత్నించకపోవడం, బయటకు వచ్చిన తర్వాతే మర్యాదగా మాట్లాడటం వంటివి సమానత్వాన్ని ప్రతిబింబించాయని ఆయన అన్నారు. దైవాన్ని ఆరాధించడానికి ఒక స్థలం, సమయం లభించడం, ఎవరూ అడ్డుకోకుండా ఎంతసేపైనా ప్రార్థన చేసుకోవచ్చు అనే వాతావరణం తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చిందని జై వివరించారు. “ఇక్కడ ఒక సమానత్వం ఉందేమో, అందరినీ సమానంగా చూస్తున్నారేమో అని నాకు మొదట బలంగా అనిపించింది” అని ఆయన పేర్కొన్నారు.

ఇస్లాం మతంలో చేరాక తన వ్యక్తిత్వం చాలా మారిందని జై తెలిపారు. ముఖ్యంగా, హెల్పింగ్ మైండ్ పెరిగిందని, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలనే తపన అధికమైందని చెప్పారు. గతంలో కొత్త కార్లు, ఫోన్లు వంటి అనవసర వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి చూపిన తాను, ఇప్పుడు ఇస్లాం నియమాల ప్రకారం తన ఆదాయంలో ఒక కొంత పేదలకు ఇవ్వడాన్ని అలవరచుకున్నానని అన్నారు. “మీ జీతంలో నుంచి మీరు ప్రజల కోసం ఒక 30శాతం ఇవ్వాలి, లేదా ఒక 15 శాతం ఇవ్వాలి” అనే నియమం తనలో పరిణతిని పెంచిందని, అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని, ఆ డబ్బును అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించడం వల్ల గొప్ప సంతృప్తి లభిస్తుందని జై అభిప్రాయపడ్డారు. ఇది తనను మరింత నిలదొక్కుకునేలా చేసిందని, పరిణతి చెందిన వ్యక్తిగా మార్చిందని ఆయన అన్నారు. అలాగే నేను మాత్రమే మారాను, ఫ్యామిలీ అంతా అలాగే ఉంది” అని జై స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు ఆలయాలకు వెళ్లి వచ్చినప్పుడు తనకు విభూది పెట్టడం, ఇంట్లో పూజా గది ఉండటం వంటివి సహజమని, తాను వాటిని ప్రేమానురాగాలతో స్వీకరిస్తానని చెప్పారు. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో తనకు ఇష్టమైన ఇస్లాంకు సంబంధించిన వస్తువులు పెట్టుకున్నానని, కుటుంబ సభ్యుల మత విశ్వాసాలను తాను గౌరవిస్తానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి



Jai

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *