ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కిలో పెద్ద ఉసిరికాయలు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.
ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి ఒక గిన్నెలో తీసుకుని కనీసం 10 నిమిషాల పాటు ఆవిరిపైన వీటిని మెత్తగా ఉడికించాలి. ఇంకా ఈ ఉసిరికాయలు మెత్తబడిన ఫ్యాన్ కింద కొద్దీ సేపు చల్లార్చిన తరవాత , గింజలను తీసేసి వీటిని ముక్కలుగా చేసుకోవాలి.
ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు చల్లని ఉసిరికాయ ముక్కలను తీసుకుని వీటిని మిక్సీలో వేసి మెత్తగా బాగా పేస్ట్ మాదిరి పట్టుకోవాలి. ఇక ఇప్పుడు పెద్ద గిన్నెలో ఈ ఉసిరికాయ పేస్ట్ వేసి, దానిలో బెల్లం తురుము కూడా వేసి మీడియం మంటపై కలుపుతూ బాగా ఉడికించాలి. బెల్లం మొత్తం నీటిలో కరిగే వరకు వీటిని కలుపుతూ ఉండాలి.
ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఈ పేస్ట్ మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా ఉండేందుకు ఆయిల్ వేసి అది వేడి అయినా తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి, ఇంకా చిటికెడు ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలపాలి. చివర్లో ఒక టీస్పూన్ నెయ్యి కూడా వేసి కలిపితే మంచి టేస్ట్ వస్తుంది.
ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు ఒక ప్లేట్‌కు వేసి చిక్కగా చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బుడ్డి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ క్యాండీలు కొంచం కూడా తేమ లేకుండా ఉండేలా రెండు రోజులు గాలి తగిలేలా ఉంచితే ఇవి మరింత గట్టిగా అవుతాయి. అప్పుడు తినడానికి మంచిగా ఉంటుంది.





