తెలుగు ప్రేక్షకులకు నటి హేమ సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై తనదైన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సినిమాలు తగ్గించినా హేమ.. ఏదోక విషయంతో వార్తలలో నిలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె తన కుటుంబంతో కలిసి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంచ్ (Mercedes-Benz) లగ్జరీ కారును ఆమె తన సొంతం చేసుకున్నారు. ఈ కొత్త వాహనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కొత్త కారును డెలివరీ తీసుకునేందుకు నటి హేమ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి షోరూమ్‌కు వెళ్లారు. అక్కడ సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, కేక్ కట్ చేసి ఈ సంతోషకరమైన క్షణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
అనంతరం కారుకు ఉన్న కవర్‌ను తొలగించి, షోరూమ్ సిబ్బంది సమక్షంలో కారు కీస్‌ను అందుకున్నారు. ఈ క్రమంలో ఆమె ముఖంలో కనిపించిన ఆనందం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కారు డెలివరీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన హేమ అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “మీ కొత్త లగ్జరీ ప్రయాణం అద్భుతంగా సాగాలి” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
తెలుగు చిత్ర పరిశ్రమలో వందలాది సినిమాల్లో నటించి, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ.. వివాదాలు, రాజకీయాల పరంగా కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, ఈసారి తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఒక పాజిటివ్ అప్‌డేట్‌తో ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హేమ కొన్న కారు ధర దాదాపు రూ.కోటిన్నర వరకు ఉన్నట్లు తెలుస్తోంది.. ఖరీదైన ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ సరికొత్త మెర్సిడెస్ బెంచ్ కారు ఆమె గ్యారేజ్‌లోకి చేరడంపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
నటి హేమ ఇన్ స్టా పోస్ట్..
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
