తాజావార్తలు

Sobhan Babu : ఇండస్ట్రీలో విషాదం.. శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..

Sobhan Babu : ఇండస్ట్రీలో విషాదం..  శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నటభూషణ్, హీరో శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు. చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె.. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. శాంతకుమారి మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, సినీ ప్రముఖులు, దిగ్ర్భాంతికి గురయ్యారు. శుక్రవారం (జూలై 10న) శాంతకుమారి అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1958 మే 15న శోభన్ బాబు, శాంతకుమారి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..

తెలుగు సినీ రంగంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలతో రూపొందించిన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నారు. చివరి శ్వాస వరకు హీరోగానే నటిస్తానని చెప్పిన శోభన్ బాబు పలు చిత్రాల అవకాశాలను సైతం వదులుకున్నారు. 2008లో గుండెపోటుతో శోభన్ బాబు కన్నుమూశారు.

ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్‏లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *