జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.
జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల రెండో వారంలో అత్యంత ముఖ్యమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. కుజ, చంద్రుని కలవడం వలన ఈ రాజాయోగం ఏర్పడనుంది. అంతేకాదు, ఈ యోగం రెండు రాశులకు మంచి రోజులు తీసుకు రానుంది.. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మేష రాశి : మేష రాశి వారి ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎప్పటినుంచో కల కంటున్న ఉద్యోగం కూడా వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇంకా ఇంట్లో ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. వెళ్లినా ప్రతి ప్రదేశం వీరిది అవుతుంది. ఇంకా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
ధనుస్సు రాశి : ఈ రాశివారికి అనుకూలంగా మారుతుంది. అలాగే జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. అయితే అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు కలిసి వస్తాయి. ఇంకా కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళు అధిక లాభాలు పొందుతారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.





