తాజావార్తలు

దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..

దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..


నల్లగొండలో సంచలనం సృష్టించిన తెలంగాణ కాలనీ నాలుగు హత్యల కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. కన్నతల్లి హసీనా, తండ్రి సుల్తాన్, ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపించింది మరెవరో కాదు.. సొంత కూతురు, అల్లుడేనని విచారణలో నిర్ధారణ అయింది. ఆస్తి మొత్తం తమకే దక్కాలనే దురాశతో, భారీ మొత్తంలో సుపారీ (నగదు) ఇచ్చి కిరాయి హంతకులతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. గతంలో వీరి ఇంట్లో జరిగిన దొంగతనం కూడా ఈ కూతురు, అల్లుడి పనేనని విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఒక్కొక్కరినీ వెతికి మరీ..

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్రణాళికతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు మొదట సుల్తాన్‌ను అంతమొందించారు. ఆ తర్వాత తల్లి హసీనాను అత్యంత క్రూరంగా హతమార్చారు. తల్లిదండ్రులను కళ్లెదుటే చంపుతుండటంతో భయాందోళనకు గురైన చిన్నపిల్లలు ముజామీల్, అప్సర ప్రాణాలు దక్కించుకోవడానికి మంచం కింద దాక్కున్నారు. అయినా వదలని హంతకులు మంచం కింద ఉన్న ముజామీల్‌ను బయటకు లాగి, కడుపులో 14 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. చివరగా 13 ఏళ్ల చిన్నారి అప్సరను చంపేందుకు సిద్ధమవగా.. నన్ను చంపవద్దు అంటూ ఆ పాప హంతకుల కాళ్లు పట్టుకుని వేడుకుంది. అయినప్పటికీ కనికరం లేని ఆ రాక్షసులు చిన్నారిని అతి కిరాతకంగా నరికి చంపారు. నలుగురిని మట్టుబెట్టిన అనంతరం నిందితులు ఏమీ తెలియనట్లు ఇంటి గేటుకు తాళం వేసి అక్కడి నుండి పరారయ్యారు.

ఆస్తి కోసమే కన్నవారి బలి

తల్లిదండ్రుల ఆస్తి తనకు దక్కదనే భయంతోనే కూతురు, అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టారు. హసీనా, సుల్తాన్‌లను వదిలితే ఆస్తి వేరేవారికి వెళ్తుందనే క్రూరమైన ఆలోచనతో, పిల్లలతో సహా కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేందుకు సుపారీ ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *