స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె కారవాన్ లో దొంగలు చొరబడ్డారు. హీరోయిన్ పర్స్ లో ఉన్న 50 వేల రూపాయలు కొట్టేసారు. రాశీ షూటింగ్ కి వెళ్లొచ్చే గ్యాప్ లో ఈ ఘటన జరిగింది. కారవాన్ లో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన రాశీఖన్నా మేనేజర్ కి చెప్పడంతో సెట్ లో ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉంటారని సెట్ ని లాక్ చేసి దొంగని వెతికారు. తీరా వెతికితే ఆ కారవాన్ డ్రైవరే రాశీఖన్నా పర్స్ నుంచి డబ్బులు కొట్టేసాడట. దీంతో ఆ డ్రైవర్ కి బుద్ది చెప్పి ఆ కారవాన్ సంస్థకు సమాచారం అందించి అతన్ని సెట్ లోంచి పంపించేసారట. సాధారణంగా హీరోయిన్స్ అంత డబ్బుని పర్స్ లో క్యారీ చేయరు. ఆ రోజు షూటింగ్ అయ్యాక ఏదో అవసరం ఉంది అని తెచ్చుకుందట. తీరా చూస్తే దొంగతనం జరిగింది. కానీ చివరకు దొంగని పట్టుకొని ఆ డబ్బులను రాశీఖన్నాకు తిరిగి ఇప్పించారు. కాగా ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సినిమా షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటని చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా గతేడాది తెలుసు కదా తెలుగు ఆడియెన్స్ న పలకరించింది రాశీ ఖన్నా. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్‌తో మన ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోందీ అందాల తార. ఇందులో అక్షయ్ కుమార్, విద్యా బాలన్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. దీంతో పాటు లుక్కే అనే ఓ వెబ్ సిరీస్ లోనూ కీలక పాత్రలో కనిపించనుంది రాశీ. ర్యాపర్ కింగ్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్న ఈ సిరీస్ లో రాశీ ఖన్నా, శివాంకిత్, లక్ష్య వీర్ శరణ్, పాలక్ తివారీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మే 08న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి
రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
