కోరికలు వెంటనే తీర్చే తెలంగాణ సింధూర గణపతి.. ఏటా పెరుగుతున్న అద్భుత వినాయకుడు!
కలియుగంలో భక్తుల ప్రార్థనలకు త్వరగా స్పందించే దేవతలలో విఘ్నేశ్వరుడు ప్రముఖుడు. “కలౌ కపి వినాయకః” అని శాస్త్రవాక్యం చెబుతుంది. అంటే ఈ యుగంలో వినాయకుడు, ఆంజనేయుడు అత్యంత శీఘ్రంగా అనుగ్రహించే దేవతలు అని భావం. అందుకే కోరికల సాధన కోసం గణపతి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సింధూర వర్ణంలో దర్శనమిచ్చే గణపతిని పూజిస్తే ఐశ్వర్యం, శుభఫలితాలు, కార్యసిద్ధి కలుగుతాయని పురాణాలు పేర్కొంటాయి. ఎక్కడ ఉంది ఈ ఆలయం? తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో అలాంటి మహిమాన్వితమైన…
