కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్
భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.95,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, వార్షిక లాభాల్లో 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ, గత ఏడాది రూ.80,787 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో త్రైమాసికం (Q4FY26)లో కొంత మందగమన సంకేతాలు కనిపించాయి. గత ఏడాది…
