Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్ జోలికి వెళ్లనే వెళ్లరు
అయితే, ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లి గంటల తరబడి చెమటలు చిందించడమే కాదు. కేవలం రెండు నిమిషాల వ్యాయామంతో కూడా అద్భుతాలు చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం మనం చేసే తీర్మానాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా? మన జీవనశైలిని పరిగణనలోకి తీసుకోకుండా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడమే అందుకు ప్రధాన కారణం. నిజానికి ఫిట్‌గా ఉండటానికి ఏసీ గదుల్లో గంటల తరబడి వర్కవుట్లు చేయక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల…
