Raisins Benefits: కిస్మిస్ అని లైట్ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
ఎండుద్రాక్ష అనేది ఒక చిన్న ఎండిన పండు. ఆయుర్వేదంలో వీటిని డ్రైఫ్రూట్గా మాత్రమే కాకుండా, ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎండుద్రాక్షలు శరీరాన్ని పోషించడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త లోపాన్ని పూరించడంలో సహాయపడుతుంది. ఈ ఎండిన పండు ఎముకలను బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి రక్షిస్తుంది. ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టడం లేదా పాలలో…
