తాజావార్తలు

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం


చైనాలోని శంజియాబో శ్మశాన వాటికలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2,300 ఏళ్ల నాటి ఒక అద్భుత రహస్యం వెలుగుచూసింది. క్రీ.పూ. 547 – 221 క్విన్ రాజ్య కాలానికి చెందిన ఒక సామాన్య సైనికుడి సమాధిలో అత్యంత జాగ్రత్తగా సీల్ చేసిన ఒక కంచు పాత్ర లభించింది. శతాబ్దాలుగా ఇది భూగర్భంలోనే ఉన్నప్పటికీ ఈ పాత్రలోని ద్రవం ఆవిరి కాకపోవడం విశేషం. వెల్లుల్లి పాయ ఆకారపు మెడ కలిగిన ఈ కంచు పాత్రలో దాదాపు 15 కప్పుల లేత నీలం-ఆకుపచ్చ రంగు ద్రవం భద్రంగా ఉంది. రసాయనిక విశ్లేషణలో ఇందులో ఏకంగా 2,400 కంటే ఎక్కువ రకాల సమ్మేళనాలు బయటపడ్డాయి. ఇది పండ్లతో చేసిన వైన్ కాదని, గోధుమలు, బార్లీ, సామలు వంటి ధాన్యాలను పులియబెట్టి తయారు చేసిన ఒక రకమైన ప్రాచీన బీర్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పాత్ర మూతిని మొదట ఒక వస్త్రంతో గట్టిగా కట్టి, ఆపై మట్టి మిశ్రమంతో రెండో పొరగా సీల్ చేయడం వల్లే ఇన్నేళ్లయినా ఈ ద్రవం సురక్షితంగా నిలిచింది. ఈ అధునాతన మద్యం తయారీ, నిల్వ సాంకేతికత కేవలం పాలకులకే కాక సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేదని ఈ పరిశోధన ద్వారా స్పష్టమవుతోంది. ఈ వివరాలన్నీ ప్రసిద్ధ ‘జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్’ నివేదికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి కానీ.. పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ!

నువ్వేం చేయాలో నీకు తెలుసు.. బై శిక్షణ ఇస్తూ.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌

పెట్రోల్‌ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

గంటల దొంగ.. దొరికాడు ఇలా..!

అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *