ఎప్పుడు నీరసం, అలసటతో బాధ పడేవాళ్ళు ఇవి తింటే ఒంటికి ఎంతో చలువ చేస్తాయి. కాబట్టి, మీరు ఈ గారెలు రెండు తింటే చాలు. చాలా మంది పండుగల సమయంలో ఇవి చేసుకుని తింటారు. మరి, మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పక ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చదివి తెలుసుకుందాం..
అలసంద వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు అలసందలు, రుచికి సరిపడా ఉప్పు, 3 ఉల్లిపాయలు, 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక కప్పు కరివేపాకు ఆకులు, అర కప్పు కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఈ గారెలను కాల్చడానికి తగినంత నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది.
అలసంద వడలు తయారీ విధానం: మీరు ముందుగా అలసందలను తీసుకుని కనీసం 5 గంటల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని రోటిలో వేసి కచ్చా పచ్చగా అయినా సరే మెత్తగా రుబ్బు కోవాలి. ఇంకా మరి మెత్తగా పిండి లాగా రుబ్బ కూడదు. అలాగే, దీనిలో నీళ్ళు పోసి దీనిని గారెల పిండిలా చేసుకోండి.
తయారీ విధానం : ఇప్పుడు మీరు మీడియం సైజ్ గిన్నెలో తీసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ , అర కప్పు కరివేపాకు ఆకులు , కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే అలసంద వడలు మంచి టేస్ట్ ఉంటాయి.
మీరు ఇప్పుడు అలసంద పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి వెలిగించి నూనె వేసి అది బాగా వేడయ్యాక ఈ వడలను గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించాలి. అంతే, వేడి వేడి అలసంద గారెలు రెడీ. పల్లీల చట్నీతో తింటే లొట్టలు వేసుకుంటూ తింటారు





